వచ్చే ఎన్నికల్లో జనసేనకు షాక్ తప్పేట్లులేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం తనదే అని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసేసుకోవటమే మిగిలుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా పెద్దఆశలే పెట్టుకున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే మొన్నటి ఆవిర్భావ సభలో రాబోయే ప్రభుత్వ బాధ్యత తాను తీసుకోబోతున్నట్లు చెప్పింది. సరే పవన్ ఆశల సంగతి ఎలాగున్నా పార్టీకి షాక్ తగలబోతున్నట్లుంది.





ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందుకు ఇప్పటినుండే యాక్షన్ ప్లాన్ కూడా రెడీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆప్ ముఖ్యలు పర్యటనలు చేస్తున్నారు. తటస్తులను, మేధావులను, ఇతర పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నవారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఢిల్లీ పీఠాన్ని అందుకున్న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు జాతీయ రాజకీయాల్లో మంచి క్లీన్ ఇమేజుంది.





గడచిన ఎనిమిదేళ్ళుగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పనితీరును, పరిపాలనను చూసిన తర్వాతే మొన్నటి పంజాబ్ ఎన్నికల్లో జనాలు అఖండ విజయాన్ని అందించారు.  ఆ ఊపులోనే తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెడుతోంది. తెలంగాణా విషయాన్ని పక్కనపెట్టేస్తే ఏపిలో ముందు దెబ్బపడేది మాత్రం జనసేన పైనే అనేద వాస్తవం. ఎందుకంటే ఆప్ ప్రభావం టీడీపీని దెబ్బతీస్తుందని అనుకునేందుకు లేదు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఉన్నా లేనట్లే. ఇక మిగిలింది జనసేన మాత్రమే.





పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళయినా ఇంతవరకు జనాలపై జనసేన ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మొన్నటి ఎన్నికల్లో 5.6 శాతం ఓట్లు తెచ్చుకుంది. జనాల్లో జనసేనపైన పెద్దగా ఆసక్తి ఉన్నట్లు లేదు. అయితే ఆప్ గురించి మాత్రం బాగానే చర్చించుకుంటున్నారు. పంజాబ్ విజయంతో దేశంలోని జనాల దృష్టిని ఆప్ ఆకర్షించిందన్నది వాస్తవం. అందుకే ఆప్ గురించి చర్చించుకుంటున్నారు. రెండేళ్ళ యాక్షన్ ప్లాన్ తో క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని చేర్చుకుని ఎన్నికల్లో దింపితే జనసేనపైనే దెబ్బ పడుతుంది. జేడీ లక్ష్మీనారాయణ లాంటి అనేకమంది ఆప్ లో చేరే అవకాశముందంటున్నారు. కాబట్టి జనసేనకు వచ్చే ఎన్నికల్లో  ఆప్ రూపంలో షాక్ తప్పేట్లు లేదు.


 



మరింత సమాచారం తెలుసుకోండి: