ప్రముఖ మీడియా సంస్ధ వెల్లడించిన ఒక సర్వే దెబ్బకు మొత్తం ఎల్లోగ్యాంగ్ భోరుభోరు మంటోంది. సర్వే ఫలితాలను ఏమాత్రం తట్టకోలేకపోతోంది.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అని ఇండియా టుడే దేశ్ కీ ఆవాజ్ పేరుతో దేశవ్యాప్తంగా ఒక సర్వేచేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి 362 సీట్లు వస్తుందని తేల్చింది. యూపీఏకి 97 సీట్లు వస్తాయట. ఎన్డీయేలో బీజేపీ వాటా 326 సీట్లయితే యూపీఏలో కాంగ్రెస్ వాట 38 సీట్లు మాత్రమేనట.సరే జాతీయస్ధాయిలో ఏ పార్టీ పరిస్దితి ఏమిటి అనే విషయాన్ని పక్కనపెట్టేసి ఏపీ మాత్రమే చూసుకుందాం. లేటెస్టు సర్వే ప్రకారం వైసీపీకి 19 సీట్లు వస్తాయట. టీడీపీకి 6 సీట్లు వస్తాయని తేలింది. పార్లమెంటు సీట్ల ఆధారంగా అసెంబ్లీ సీట్లను కూడా మనం అంచనా వేసుకోవచ్చు. వైసీపీ 19 లోక్ సభ సీట్లను సాధిస్తుందని సర్వేలో తేలిందంటే నాట్ బ్యాడ్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని దాదాపు మూడేళ్ళుగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో పాటు వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్న మీడియా పదే పదే ఊదరగొడుతోంది.


మరి ఇంత ప్రజావ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నప్పటికి వైసీపీ 19 సీట్లలో గెలుస్తుందంటే మామూలు విషయంకాదు. ఈ సీట్లను అసెంబ్లీ సీట్లలోకి కన్వర్ట్ చేస్తే 133 సీట్లవుతుంది. ప్రతి లోక్ సభ నియోజకవర్గంలోను 7 అసెంబ్లీలుంటాయి. వీటిల్లో మెజారిటి సీట్ల అంటే కనీసం ఐదింటిలో గెలిస్తేకానీ ఏ పార్టీ అయినా ఒక లోక్ సభ సీటు గెలవటం సాధ్యంకాదు. ఇలా 5 అసెంబ్లీల్లో గెలిస్తే కూడా వైసీపీకి 95 సీట్లొస్తాయి. అంటే మళ్ళీ అధికార వైసీపీదే అనుకోవాలి.


ఇదే సమయంలో టీడీపీ గెలుస్తుందని అనుకుంటున్న 6 లోక్ సభ సీట్ల పరంగా చూస్తే అసెంబ్లీ సీట్లు 42 సీట్లు సాధిస్తుందనే అనుకోవాలి. అంటే అన్నీ అసెంబ్లీ సీట్లను టీడీపీయే గెలుస్తుందని అంచనా వేస్తే. అదే మెజారిటి 5 అసెంబ్లీలను గెలుస్తుందనుకుంటే 30 ఎంఎల్ఏలతో సరిపెట్టుకోవాల్సిందే. ఇదే సమయంలో జనసేన, బీజేపీలకు ఒక్క ఎంపీ సీటు కూడా రావటంలేదని తేలిపోయింది. సో సర్వే ప్రకారం చూస్తే వైసీపీదే వహా అని అర్ధమవుతోంది. దీన్నే ఎల్లోగ్యాంగ్ తట్టుకోలేకపోతోందని సమాచారం.మరింత సమాచారం తెలుసుకోండి: