బంగాళాఖాతంలో నవంబర్ 9న ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం నేడు తీరాన్ని తాకనుంది.నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించి నేడు తీరం తాకుతుంది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు ప్రభుత్వం నేడు చెన్నై, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, వెల్లూరు మరియు కాంచీపురంలోని 6 జిల్లాల్లో పాఠశాలలు మరియు కళాశాలలకు సెలవుదినంగా ప్రకటించింది.


అలాగే ఏపీలో నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో వాతావరణం పొడిగా మారిపోయింది. మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. శ్రీలంక తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి నేడు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం తాకే అవకాశం ఉంది. భారీవర్షం వచ్చే అవకాశం ఉందని వెంకటగిరి మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌ హెచ్చరించారు..

దక్షిణ కోస్తాంధ్ర భాగాలైన ప్రకాశం పశ్చిమ భాగాల్లో, పల్నాడు, ఎన్.టీ.ఆర్, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలున్నాయి. నిన్న రాత్రి నుంచి చెన్నై, తమిళనాడు మీదుగా వాయుగుండం ప్రభావం ఉంది. బంగాళాఖాతంలో ఇప్పుడు రాడార్ చిత్రం చూస్తే భారీ మేఘాలు విస్తరించి ఉన్నాయి. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల్లో సాయంకాలం, రాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తిరుపతి జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని తెలుస్తుంది..ఇక తెలంగాణాలో చూస్తె..వాతావరణం పొడిగా మారింది. మరో మూడు రోజులవరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా నమోదవుతుండగా.. రాత్రివేళ చలి తీవ్రత అధికంగా ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: