ఏపీలో వాతావరణం ఒక్కోసారి ఒక్కో విధంగా మారుతుంది.. మొన్నటివరకు ఏపీని వీడని భారీ వర్షాలు.. ఇప్పుడు మరో హెచ్చరిక ను అధికారులు జారీ చేశారు.. డిసెంబర్ 08 ఉదయం నాటికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడులో ని పుదుచ్చేరిని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. అల్ప పీడనం ప్రభావం తో ఇప్పటికే తమిళనాడు లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.


కాగా, ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపోస్పియర్‌ లో ఈశాన్య, తూర్పుగాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ సూచన ప్రకారం, ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్ర లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తుంది.. దక్షిణ కోస్తా ఆంధ్రా లో నేడు, రేపు, ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు రాయలసీమ లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు.


మరోవైపు ఈ మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. డిసెంబరు 8న లక్షద్వీప్‌ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, మహారాష్ట్ర లో ఉరుముల తో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 8 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో కి చేపల వేటకు వెళ్లొద్దని IMD మత్స్యకారుల ను కోరింది. కాగా, పుదుచ్చేరి లో ఆదివారం కురిసిన వర్షాలకు నగరంలో ని వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు..


మరింత సమాచారం తెలుసుకోండి: