వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేతిలో మొత్తం ఎల్లోబ్యాచ్ కు మాడు పగిలినట్లే ఉంది. రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ లిస్టులో నుండి కొద్దిరోజుల క్రితం విజయసాయి పేరును ఛైర్మన్ జగదీప్ ధనకర్ తీసేశారు. ఎనిమిది మందితో ప్యానల్ వైస్ ఛైర్మన్లను నియమించినట్లు  ఛైర్మన్ ప్రకటించినపుడు అందులో సాయిరెడ్డి పేరుంది. రెండోసారి తనను ప్యానల్లో అవకాశం ఇచ్చినందుకు ఎంపీ ధన్యవాదాలు కూడా చెప్పారు.






అలాంటిది మరో మూడురోజుల తర్వాత ఇదే ప్యానల్ ను రాజ్యసభలో చదివి వినిపించినపుడు సాయిరెడ్డి పేరును తొలగించారు. దాంతో ఇదే విషయం ఏపీ రాజకీయాల్లో ఓ రెండురోజులు చర్చనీయాంశమైంది. ఎందుకు తొలగించారో తెలీదుకానీ దానికి కారణం మాత్రం తానే అన్నట్లు గా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కలరింగ్ ఇఛ్చుకున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్ధులను  అసభ్యంగా కామెంట్లు చేస్తున్న వైనాన్ని తాను రాజ్యసభ ఛైర్మన్ థనకర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకున్నారు.





తిరుగుబాటు ఎంపీ ప్రకటనకు యావత్ ఎల్లోమీడియా, టీడీపీ నేతలంతా విపరీతంగా సంతోషపడిపోయారు. ఎల్లోమీడియా అయితే ఈ విషయాన్ని పనిగట్టుకుని మరీ ప్రచారం చేసింది. అయితే పదిరోజులు గడిచేసరికి సాయిరెడ్డిని రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానల్లో చేరుస్తు ధనకర్ తాజాగా ప్రకటించారు. తాజాగా సవరించిన ప్యానల్లో సాయిరెడ్డి, పరుగుల రాణి పీటీ ఉషను కూడా చేర్చారు.





ప్యానల్లో నుండి సాయిరెడ్డి పేరు తీసేసినపుడు తన ఘనతనే చెప్పుకున్న తిరుగుబాటు ఎంపీ మరిపుడు ఏమని చెబుతారు ? అప్పట్లో రెచ్చిపోయిన ఎల్లోమీడియా తాజా డెవలప్మెంట్ పై  ఏమంటుంది ? రాజ్యసభ ప్యానల్లో ముందు ఎందుకు చేర్చారో తెలీదు. సీనియారిటిని బట్టే ప్యానల్లో చేర్చినట్లు అనుకున్నారు. తర్వాత ఎందుకు తీసేశారో తెలీదు. తీసేసినందుకు కారణాలను ఏమీ చెప్పలేదు. మళ్ళీ ఇపుడు ఎందుకు ప్యానల్లో చేర్చారో కూడా చెప్పలేదు. ఏదేమైనా ప్యానల్లో చేర్చటం, తీసేయటం, మళ్ళీ చేర్చటం అంతా రాజకీయ బలప్రదర్శనకు వేదిక అయిపోయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: