
నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం నారాయణ రెడ్డిలు పార్టీని వీడారు. అయితే వీరు ఏ పార్టీలోకి వెళ్లనున్నారు అన్న విషయంలో ఐడియా ఉన్నప్పటికీ ఇంకా స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీ తరపున పోటీ చేస్తాను అన్న మాట తెలిసిందే. అయితే చంద్రబాబు తో మాట్లాడకుండానే బహిరంగంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారా ? దీనిపై చంద్రబాబు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం అది డైలమాలో ఉన్నట్లే లెక్క. ఇక మరో నేత ఆనం రామనారాయణ రెడ్డి గతంలో టీడీపీ నుండి వచ్చిన వారే కాబట్టి ఈయనకు కూడా టీడీపీలో టికెట్ ఖాయం. అయితే ఇప్పుడు ఒక వింత సమాచారం వీరిద్దరిపై పొలిటికల్ వర్గాలలో హల్ చల్ చేస్తోంది.
మాములుగా అయితే కోటంరెడ్డి పార్టీని వీడక ముందు వరకు ఆత్మకూరు టీడీపీ టికెట్ ను తన కూతురు కైవల్య రెడ్డికి మరియు నెల్లూరు రురల్ నుండి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయడానికి ప్రణాళిక చేసుకున్నారట. ఇందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారట. అయితే ఇప్పుడు కోటంరెడ్డి వైసీపీని వీడడం.. తాను కూడా టీడీపీ టికెట్ ఆశించడంతో కొంచెం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కోటంరెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఆనం కు టికెట్ ఇచ్చినా రురల్ లో అతని నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే కోటంరెడ్డికి టికెట్ ఇస్తే ఆనం టీడీపీలోకి వెళ్లారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ లాజిక్ ఏమిటో దీని చిక్కుముడి వీడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.