‘జగన్మోహన్ రెడ్డిది గవర్నమెంట్ ఆర్డర్..లోకేష్ ది పబ్లిక్ ఆర్డర్’ ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదు. అవును ఈమధ్యనే రిలీజైన నందమూరి బాలకృష్ణ సినిమాలోని డైలాగే. కాకపోతే ఆ డైలాగునే మార్చి పాదయాత్రలో లోకేష్ తనకు అనుకూలంగా చెప్పుకున్నారు. జగన్ ది గవర్నమెంట్ ఆర్డర్ అంటే అర్ధముంది. ఎందుకంటే జగన్ సీఎం కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను గవర్నమెంటు ఆర్డర్ (జీవో) అంటారు. మరి పబ్లిక్ ఆర్డర్ అంటే ఏమిటి ? బహుశా డైలాగ్ చెప్పిన లోకేష్ కైనా తెలుసో తెలీదో.





మీసాలు తప్పిటం, తొడలుకొట్టడం, డైలాగులు చెప్పటంలో మేనమామ కమ్ మామగారు నందమూరి బాలకృష్ణనే లోకేష్ ఫాలో అవుతున్నారు. పబ్లిక్ లోకి వచ్చినపుడు బాలకృష్ణ కూడా ఏమి మాట్లాడుతారో చాలావరకు అర్ధంకాదు. కాగితం చూడకుండా బాలయ్య ఒక్క నిముషం కూడా మాట్లాడలేరు. అదేపద్దతి లోకేష్ లో కూడా కనబడుతోంది. జనాలకు కాదు తాను మాట్లాడుతున్నది లోకేష్ కైనా అర్ధమవుతోందో లేదో.





చంద్రబాబును ప్రపంచానికి అందించిన ఘనత చంద్రగిరికే దక్కుతుందట. చంద్రబాబు ప్రపంచమేథావుల్లో ఒకరట. విజయనగరం సామ్రాజ్యంలో చంద్రగిరి ఎంతగా పాపులరైందో చంద్రబాబు హయాంలో కూడా చంద్రగిరి అంతే పాపులరైందట. విజయనగర సామ్రాజ్యానికి చంద్రబాబు పాలనకు లింకు ఏమిటో తెలీటంలేదు. అసలు చంద్రబాబు ప్రపంచమేథావి ఏమిటో లోకేష్ కే తెలియాలి. నిజంగానే చంద్రబాబు పాలనలో చంద్రగిరి అంత బ్రహ్మాండంగా డెవలప్ అయితే మరి నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడో ఉన్న కుప్పంకు ఎందుకు పారిపోయారు.





పుట్టి పెరిగి మొదటిసారి ఎంఎల్ఏ అయిన చంద్రగిరిని చంద్రబాబు 1989లోనే వదిలేసి కుప్పంకు వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1983 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు. ఇక చంద్రగిరిలో గెలవటం కష్టమని అర్ధమయ్యే కుప్పంకు పారిపోయారు. వాస్తవం ఇలాగుంటే చంద్రబాబును భారతజాతికి అందించిన ఘనత చంద్రగిరికే దక్కుతుందని లోకేష్ చెప్పటం పెద్ద జోక్ గా తయారైంది. ఓటమి భయంతో చంద్రబాబు చంద్రగిరిని వదిలేస్తే  పుట్టుమేథావి లోకేష్ అయినా వారసత్వంగా వచ్చి ఇక్కడ ఎందుకు పోటీచేయటంలోదో కారణం చెప్పగలరా ?



మరింత సమాచారం తెలుసుకోండి: