జీవో 111 ఎత్తివేతపై నిపుణులు, పర్యావరణవేత్తలతో అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి పరిమితులు లేకుండా జీవో 111ను ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దీనిపై పర్యావరణవేత్తలు, ప్రజలలో తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు.


ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిధిలోనున్న లక్షల ఎకరాల పరివాహక ప్రాంతాలలో భూగర్భజలాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఈ జీవో ఎత్తివేత ద్వారా ఉన్నదని భావిస్తున్నారని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ జంట జలాశయాలు రంగారెడ్డి జిల్లాలోని అనేక ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటిని, హైదరాబాద్‌కు త్రాగునీటిని అందిస్తున్నాయని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తెలిపారు. అక్కడ నిర్మాణాలు చేపట్టితే ఆ జలశాయాలు మురుగు నీటితో కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తంచేశారు.


ఈ జలశయాలను కాళేశ్వరం ఎత్తిపోతల నీటితో నింపుతామని ప్రభుత్వం చెబుతున్నదన్న  సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు.. సహజసిద్ధమైన పరివాహక జలాలతో కాకుండా ఇలా ఎత్తిపోయడం ద్వారా ఆ జలాశయాలు సహజసిద్ధతత్వాన్ని, పర్యావరన సమతూల్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీనివెనుక రాజకీయనాయకులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాలు దాగివున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు.


జీవో 111కు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుందన్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు.. ఈ నేపథ్యంలో జీవో 111కు ఎత్తివేతకు రాష్ట్ర ప్రభుత్వం తొందరపడకూడదన్నారు. దీనిపై నిపుణుల, పర్యావరణవేత్తలు, రాజకీయ పార్టీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు స్వీకరించాలని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. జీవో 111 ఎత్తివేతపై తొందరపడితే హైదరాబాద్‌ కే పెను ప్రమాదం పొంచి ఉంటుందని ఆయన హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: