ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో బ్రిటిష్ కాలంనాటి పడవను గ్రామస్తులు వెలికితీశారు. దుర్మి గ్రామానికి సమీపంలో ఉన్న నదిలో 50 సంవత్సరాల క్రితం భూమిలో కూరుకుపోయి పడవను కనుగొన్నారు. 1970లో వాతావరణం అనుకూలించక, నదిలోఈ పడవ మునిగిపోయిందని.. 5 అడుగుల లోతున తవ్వి, ఈ పడవను బయటకు తీసినట్లు గ్రామస్థులు తెలిపారు.