నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా సోమశిల, కండలేరు డ్యామ్‌లకు వరద ఉధృతి పెరుగుతోంది. సోమశిల డ్యాం ప్రస్తుత ఇన్ ఫ్లో 28,637క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రస్తుత నీటి నిల్వ 46.816 టీఎంసీలుగా, పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కండలేరు డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వ 24.202 టీఎంసీలుగా ఉంది. అలాగే ఇన్ ఫ్లో 7891 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 70 క్యూసెక్కులుగా కొనసాగుతోంది