భారతీయ జనతా పార్టీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నో సంవత్సరాలనుండి ఎవరూ పట్టించుకోని ఈశాన్య రాష్ట్రంగా ఉన్న త్రిపుర దారిద్య్రరేఖకు చాలా దిగువన ఉంది. ఇప్పడు ప్రభుత్వం వారు త్రిపుర నుండి బంగ్లాదేశ్ కు జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనితో అక్కడి ప్రజల ఎగుమతి దిగుమతులు పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి.