కృష్ణా జిల్లా రాజకీయాలు బాగా ఆసక్తికరంగా నడుస్తున్నాయి. జిల్లాలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య బూతుల యుద్ధం నడుస్తోంది. విచిత్రమేంటి అంటే ఇక్కడ వైసీపీలో కమ్మ నేతలు, టీడీపీ కమ్మ నేతలు ఒకరిపై తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే కమ్మ నేతల వార్‌లో ఓ టీడీపీ కమ్మ నేత మాత్రం పూర్తిగా సైలెంట్ అయి సినిమా చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన కమ్మ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వసంత కృష్ణ ప్రసాద్‌లు వరుసపెట్టి చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు.