కన్నా లక్ష్మీనారాయణ...ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో చక్రం తిప్పిన నేత. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించారు. ఇక రాష్ట్ర విభజన జరిగాక, కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయినా సరే, కన్నా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపునే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే రాను రాను ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కనుమరుగు కావడంతో కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నారు. జగన్ పాదయాత్ర సమయంలో కన్నా వైసీపీలో చేరిపోవాలని అనుకున్నారు.