కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగమైన అన్ని ప్రముఖ కంపెనీలు ఒక్క తాటిపైకి వచ్చాయి. వీలైనంత త్వరగా అన్ని శాస్త్రీయ ప్రమాణాలను పాటిస్తూ కోవిడ్ వాక్సిన్ ను తయారుచేయాలంటూ ప్రతిజ్ఞ చేసాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్ యొక్క సామర్ధ్యం కూడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించాయి.