కరోనా వైరస్ నేపథ్యంలో మారటోరియం విధించిన సమయంలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ తప్పక వసూలు చేస్తామని బ్యాంకులు చేసిన ప్రకటనపై మళ్ళీ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.. అయితే, ప్రజలపై భారం పడకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు మరియు ఆర్బీఐ వారికి రెండు వారాల గడువును ఇచ్చింది. ఈ గడువు లోపల ముగ్గురు కూర్చుని ఒక నిర్దిష్ట విధానంతో రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.