బండి సంజయ్ కు ఎన్నికల పరీక్ష త్వరలో ఎదురుకానుంది. వరుస ఎన్నికలను ఆయన ఢీ కొట్ట బోతున్నారు. ఒకటి అసెంబ్లీ మరికొన్ని ఎమ్మెల్సీ.. ఇంకొన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. సంజయ్ ఎన్నికల వ్యూహానికి ఇది తొలిపరీక్ష ... అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సమరంలో పార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అప్పటికి సంజయ్ సారథిగా రాలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉంది అనుకుంటున్న సంజయ్.. ఇప్పుడు ఎటువంటి ఫలితం రానుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.