రఘురామకృష్ణంరాజు క్యాస్ట్ పాలిటిక్స్ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుందని చెప్పి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అసలు వైసీపీ పార్లమెంటరీ నాయకుడుగా మిథున్ రెడ్డి పనికిరారు అన్నట్లుగా మాట్లాడారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడికి సంబంధించి ఎన్నికలు పెడితే, మిథున్ రెడ్డికి 3 ఓట్లు కూడా రావని, సీక్రెట్ బ్యాలెట్ పెడితే ఒకటి రెండు తప్ప.. మిగిలినవి తనకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.