వినుకొండలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తోంది. తాజాగా వినుకొండలో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలని తొలగించిన విషయం తెలిసిందే. ఇక ఈ విగ్రహాల తొలగింపు వెనుక ఎమ్మెల్యే బొల్లా ఉన్నారని చెప్పి జివి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో కమ్మ ఓట్ల కోసం బొల్లా, గెలిచాక టీడీపీలోకి వచ్చేస్తానని చెప్పి మరీ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు.