గుడివాడ నియోజకవర్గం...మంత్రి కొడాలి నాని అడ్డా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పార్టీ ఏదైనా గత నాలుగు పర్యాయాల నుంచి ఇక్కడ విజయం ఆయనదే. ఇక్కడ నానికి చెక్ పెట్టగలిగే నాయకుడే లేడు. నాని వైసీపీలోకి వచ్చాక తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడు జగన్ కేబినెట్లో మంత్రిగా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇక నానీని ఢీకొట్టే నాయకుడు టీడీపీలో లేకుండా పోయాడు. అసలు గుడివాడలో టీడీపీ నాయకులు కంటికి కనిపించడం లేడు.