భారత సైనికులు పూర్తి పట్టు సాధించిన వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) ఫింగర్-4 ప్రాంతంపై దృష్టి మళ్లించేందుకు చైనా కొత్త ఎత్తుగడను వేస్తోంది. తమ ఫార్వర్డ్ పోస్టుల వద్ద లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసి పంజాబీ పాటలు వినిపిస్తోంది. చైనా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసిన ప్రాంతం భారత్ బలగాల నిరంతర పరిశీలనలో ఉంది.