ఓ కేసు విషయంలో హైకోర్టు మీడియా స్వేచ్చను హరిస్తుంటే తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖులెవరు నోరుమెదపటం లేదు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఏసిబి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎక్కడా చర్చలు జరిపేందుకు కానీ కథనాలు, వార్తలు వచ్చేందుకు లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. 24 గంటలూ మీడియా స్వేచ్చకోసమే తాము పోరాటాలు చేస్తున్నట్లు చెప్పుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడు మీడియా సంస్ధల యాజమాన్యాలు కూడా ఎందుకు నోరిప్పటంలేదో అర్ధంకావటం లేదు. ఏపిలో ప్రభుత్వం మీడియా నోరునొక్కేస్తోందని గోల చేసే చంద్రబాబునాయుడు, ప్రతిపక్షాలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాయి ? ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలను ప్రభుత్వం సిట్ తో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. దాన్ని టిడిపి నేతలు కోర్టులో ఛాలెంజ్ చేశారు.