జగన్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ పధకాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం గాను మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి ప్రయత్నంగా 10 ప్రాంతాల్లో వీటిని నెలకొల్పేందుకు చర్యలు ప్రారంభిస్తామని ఏపీజీఈసీఎల్ అధికారులు తెలియచేసారు.