అమెరికా అధ్యక్ష పదవికి 20 సంవత్సరాల క్రితం అల్బెర్ట్ గోర్, జార్జి డబ్ల్యూ బుష్ పోటీ చేసినప్పుడు పోలింగ్ జరిగిన తర్వాత ఫలితాల కోసం 36 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చింది. మళ్ళీ అలాంటి పరిస్థితి 2020లో తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని లక్షల మంది ప్రజలు పోస్టల్ బ్యాలట్ ద్వారానే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీటన్నిటినీ లెక్కించడానికి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.