ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అధికార పార్టీ వైపు వెళ్ళడం సహజమే. అలాగే వారు పార్టీలు మారక పాత అధినేతలని తిట్టడం కూడా మామూలే. టీడీపీ అధికారంలో ఉండగా, అందులోకి వెళ్ళిన వైసీపీ నేతలు జగన్ని గట్టిగానే తిట్టారు. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో, వరుస పెట్టి టీడీపీ నేతలు, జగన్ వైపు వెళుతున్నారు. వెళ్ళిన నేత వెళ్ళినట్లు చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.