కేంద్రం ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయబిల్లు మొదలైనప్పటినుండి రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ప్రతిపక్షనేత ఆజాద్ మాట్లాడుతూ సరిహద్దుల్లో ఎలాగైతే భారత్ చైనా ల పోరాటం సాగుతుందో అదేవిధంగా మేము ప్రజలకోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ బిల్లును వెనక్కు తీసుకునేవరకు సమావేశాలకు హాజరుకామన్నారు.