టీడీపీలో సరికొత్త మార్పులు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల ఘోర ఓటమి తర్వాత టీడీపీని ప్రక్షాళన చేసే దిశగా నడుస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడుని నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు సెపరేట్గా ఏపీ, తెలంగాణలకు అధ్యక్షులని నియమించిన విషయం తెలిసిందే. ఏపీకి కళా వెంకట్రావు, తెలంగాణకు ఎల్ రమణ అధ్యక్షులుగా ఉన్నారు.