ప్రతిపక్ష టీడీపీలో సొంత ఇమేజ్‌తో సత్తా చాటే నాయకుల్లో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌లు ముందు వరుసలోనే ఉంటారని చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ గాలిని ఎదురుకుని ఈ ఇద్దరు టీడీపీ జెండా ఎగిరేలా చేశారు. ఏలూరి పర్చూరు నుంచి విజయం సాధిస్తే, గొట్టిపాటి అద్దంకి నుంచి గెలిచారు. అయితే టీడీపీలో బలంగా ఉన్న వీరిపై వైసీపీ ఎప్పటినుంచో ఫోకస్ చేస్తూ వస్తుంది. వారిని ఎలాగైనా తమ వైపు లాగేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చాలాసార్లు వార్తలు వచ్చాయి.