2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో అన్నీ పార్టీలు చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ దెబ్బకు టీడీపీ చేతులెత్తేసింది. ఇంకా జనసేన,బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల పరిస్థితి అయితే మరీ దారుణం. కాకపోతే ఇక్కడ టీడీపీకి తక్కువ సీట్లు వచ్చాయి గానీ, ఓట్లు మాత్రం బాగానే పడ్డాయి. వైసీపీకి 50 శాతం వరకు ఓట్లు పడితే, టీడీపీకి 40 శాతం ఓట్లు పడ్డాయి. ఇంకా జనసేనకు 6 శాతం వరకు వచ్చాయి. ఇక కాంగ్రెస్, బీజేపీలకైతే ఒకశాతం లోపే ఓట్లు వచ్చాయి.