కేంద్ర పోలీసు బలగాలు వైరస్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు పోలీసు బలగాల్లో దాదాపు 36వేల మందికి వైరస్ సోకినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో 128 మంది మృత్యువాతపడ్డట్లు తాజా నివేదిక స్పష్టంచేసింది. ముఖ్యంగా సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎన్ఎస్జీతోపాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వైరస్ బారినపడినవారిలో ఉన్నారు.