కొద్దిరోజులక్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపై సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ కేసును ప్రాధమిక దర్యాప్తు చేసిన జిల్లా ఎస్పీ హత్రాస్ విక్రాంత్ వీర్ మరియు సంబంధిత సీఐ రామ్ షాబాద్ లతో సహా మరో ఐదుగురు పోలీసులను నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో సస్పెండ్ చేశారు.