చంద్రబాబు ప్రతి పార్లమెంట్ స్థానానికి ఒక అధ్యక్షుడుని నియమించిన విషయం తెలిసిందే. అలాగే రెండు పార్లమెంట్ స్థానాలకు కలిపి ఒక సమన్వయకర్తని నియమించారు. త్వరలోనే పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలని ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం అడుగులేస్తుందనే నేపథ్యంలో బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని వల్ల టీడీపీ యాక్టివ్ అయింది. ప్రతి పార్లమెంట్ స్థానంలోనూ పార్టీలో కొత్త ఊపు వచ్చింది.