ఊహించని విధంగా గన్నవరం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారం కోల్పోవడంతో వంశీ చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు జై కొట్టేశారు. గత ఏడాది నవంబర్లోనే టీడీపీకి గుడ్‌బై చెప్పి, జగన్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చారు. అయితే వంశీ టీడీపీని వీడాక గన్నవరంలో ఆ పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయాడు.