తెలంగాణలోని ములుగు జిల్లాలో మావోయిస్టులు వెంకటాపురం మండలం అలుబాకకు చెందిన టీఆర్ఎస్ నేత మూడురి బీమేశ్వర్ను అతి కిరాతకంగా హతమార్చారు. తన ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి బీమేశ్వర్ ను బయటకు పిలిచి కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారు.