కేంద్ర ప్రభుత్వం సమాచారం ప్రకారం ఈ నెల 15 నుంచి దశలవారీగా తెరుచుకుంటాయి అని ప్రకటించింది. అన్‌లాక్‌లో భాగంగా విద్యాసంస్థలను తెరిచేందుకు కేంద్రం ఇటీవలే అనుమతి ఇచ్చింది. అయితే దేశంలో వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గకపోవటంతో విద్యాసంస్థలు ముఖ్యంగా పాఠశాలలు ఇప్పట్లో తెరిచే సూచనలు కనిపించటం లేదు. విద్యాసంస్థలు తెరువాలా వద్దా అన్న నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయటంతో చాలా రాష్ట్రాలు మరికొంత కాలం మూసి ఉంచేందుకే మొగ్గు చూపుతున్నాయి.