ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ జనాలకు ఈ యేడాదిన్నరలో మరింతగా మోజు పెరిగిందని తాజా సర్వే స్పష్టం చేసింది. జగన్ సీఎం అయ్యి ఇప్పటికే యేడాదిన్నర కంప్లీట్ అయ్యింది. ఈ యేడాదిన్నర కాలంలో జగన్కు ప్రతి రోజు సవాళ్లే ఎక్కువుగా ఎదురయ్యాయి. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం.. మరో వైపు కేంద్రం నుంచి సపోర్ట్ లేకపోవడంతో.. సంక్షేమ పథకాలకు విపరీతంగా ఖర్చు... లోటు బడ్జెట్లో మరిన్ని అప్పులు చేయాల్సి రావడం జరుగుతున్నా జగన్ పాలనా పరంగా, సంక్షేమంలో ప్రజల నుంచి మంచి మార్కులే వేయించుకుంటున్నారు.