అనీల్ అంబానీ దివాలా కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కూడా ఇంప్లీడ్ అవ్వటంతో కథ లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. 2012లో తన ఆర్ కామ్ వ్యాపార నిర్వహణ కోసం అనీల్ అంబానీ అప్పులు తీసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే చైనాలోని మూడు బ్యాంకుల్లో 70 కోట్ల డాలర్లు అప్పు తీసుకోవడం జరిగింది. అంటే మన కరెన్సీలో సుమారు అప్పట్లోనే రూ. 4 వేల కోట్లు ఉంటుంది.... ఇంత మొత్తాన్ని అంబానీ తన ఆస్తులను షూరిటీ పెట్టి తీసుకున్నారు.