ఏపీలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి కేఎస్ జవహర్ని పెట్టారు. ఇక అధ్యక్ష పదవి రాగానే, జవహర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు.