ఏపీలో బీజేపీ పరిస్తితి ఏంటి? అని అంటే ఎవరికి ఏం అర్ధం కావడం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందనే ఫీలింగ్ ఏపీ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నా, కేంద్రంలో మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తుందని అర్ధమవుతుంది. అలా అని ఏపీలో బీజేపీ నేతలు ఒకే లైన్లో కూడా ఉన్నట్లు కనిపించడం లేదు.