చింతకాయల అయ్యన్నపాత్రుడు....టీడీపీ సీనియర్ నేత. మూడు దశాబ్దాల పైనుంచి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతూ, విలువలు పాటిస్తున్న నేత. విశాఖపట్నం నర్సీపట్నం నుంచి 9 సార్లు పోటీ చేసి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో చిత్తుగా ఓడిపోయారు. డైరక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు ఉమా శంకర్ గణేశ్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.