ఎట్టకేలకు విజయవాడ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఫ్లైఓవర్ ఓపెనింగ్ జరిగింది. ఇక దీని వల్ల విజయవాడ ప్రజల కష్టాలు తీరనున్నాయి. అయిదే ఇదే ఫ్లైఓవర్ గురించి రాజకీయాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. ఫ్లైఓవర్ నిర్మించిన క్రెడిట్ తమదంటే తమదని టీడీపీ, వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు.