ఉండవల్లి అరుణ్ కుమార్...ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఉండవల్లి..రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ని వదిలి ఏ పార్టీలో చేరకుండా అలా ఉండిపోయారు. కానీ ఏపీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఓ విశ్లేషుకుడుగా ఉంటూ, అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి, తనదైన శైలిలో రాజకీయాల మీద మాట్లాడి వెళుతుంటారు.