అమెజాన్ యాజమాన్యం తెలుపుతున్న ప్రకారం ఎప్పుడూ లేనివిధంగా ఇప్పుడు సేల్స్ పెరిగాయంట. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ దసరా సందర్భంగా 6 రోజులలో జరిగే సేల్స్ కేవలం రెండు రోజుల్లోనే పూర్తయ్యాయని సంతోషాన్ని వ్యక్తం చేసారు. దసరాతో మొదలయ్యే ఈ ఆఫర్లు దీపావళి వరకు కొనసాగుతుంటాయి. నెల రోజులపాటు కొనసాగే ఈ పండగ సీజన్లోనే చాలా కంపెనీలు 40 శాతం వరకు ఆదాయాన్ని అర్జిస్తాయి.