సాధారణంగా కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో జరిగే కొన్ని అవాంచిత చర్యలను బయటపెట్టడానికి సిబిఐ - సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగడం చూస్తూనే ఉంటాం..... కానీ విచారణ లోకి దిగే ముందు సి బి ఐ ప్రత్యేకంగా ఆ రాష్ట్రం యొక్క అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. లేదంటే ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఎప్పుడైనా ఎలాంటి విచారణ అయిన రాష్ట్రంలో జరిపేందుకు... జనరల్ పర్మిషన్ పొందాల్సి ఉంటుంది.... రాష్ట్రానికి ఏదైనా నష్టం వాటిల్లుతుంది అనుకున్న సందర్భంలో రాష్ట్ర అధికారి యొక్క జనరల్ పర్మిషన్ ను రద్దు చేసే వెసులుబాటు ఉంటుంది... వీటన్నింటికీ సంబంధించి తెలకపల్లి రవి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రధానంగా మూడు సమస్యల గురించి మాట్లాడారు.