గతవారం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు...ఇప్పటివరకు ఎన్నడూ రాని వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం తరపున ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేదు అనుభవం ఎదురైంది. వర్షాల వాళ్ళ నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు వెళ్ళిన మంత్రిని స్ధానికులు అడ్డుకున్నారు.