భారత్ సరిహద్దు ప్రాంతాలను చైనా ఆక్రమించిందని చెబుతున్న ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేసేలాగా అమెరికా ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే అమెరికా జపాన్ మరియు ఆస్ట్రేలియా లతో కలిసి క్వాడ్ అనే పేరుతో ఒక బృందంగా ఏర్పడ్డాయి. ఈ బృందం.. భద్రతా అంశాల గురించి చర్చించటానికి - ప్రధానంగా పెరుగుతున్న చైనా దూకుడుకు ఎలా ప్రతిస్పందించాలనే అంశం మీద చర్చించటానికి అక్టోబర్ ఆరంభంలో టోక్యోలో సమావేశమైంది.