ఈ దసరా పండుగ సందర్భంగా రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మారటోరియం నిర్ణయించిన కాలానికి 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు లోన్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ స్కీమ్ వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.