బెజవాడలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ...పోలవరం నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపించారు... కానీ ఇది కేవలం ఆరోపణ కాదని జరిగిన సత్యమని.... కావున లోటుపాట్లను గుర్తించి వెంటనే సరి చేయాలని తేల్చి చెప్పారు. అవినీతి జరిగిందని చెప్పడంలో అనుమానమే లేదని హాట్ కామెంట్స్ చేసారు. అంతేకాకుండా గతంలో కేంద్ర మంత్రి గడ్కరీకి కూడా  ఇదే విషయంపై ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేది లేదని ..... ఏదేమైనా ముందుకు తీసుకెళ్లాలని,పోలవరం అంచనాల పెంపుపై విచారణ జరగాలని వాస్తవ అంచనాలకు అనుగుణంగానే కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పారు ఎమ్మెల్సీ మాధవ్.