రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా  పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా తెలియచేసారు. అలాగే తాను ఉన్న పరిస్థితుల గురించి వివరించారు. ఇప్పటికి తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి ఆరోగ్యం అంతా బాగానే ఉందని ఆయన తెలిపారు. ఊపిరి అందకపోవడం ... లేదా తీవ్రమైన జ్వరం వంటి ఎటువంటి లక్షణాలు పెద్దగా లేవని పేర్కొన్నారు.