మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికార మోహంతో చేయవలసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు ఈ విధమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. మీరు పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజల భవిష్యతే ప్రధాన లక్ష్యంగా అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక బీజేపీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.