ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావణి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఓ బాధిత బాలికకు 25 వేల రూపాయల పరిహారం అందించే ఫైల్‌పై కలెక్టర్ హోదాలో సంతకం చేసిందని ఆ సమయంలో లో ఆమె ముఖం లో మెరిసిన చిరునవ్వు వెలకట్టలేనిదని ప్రశంసించారు. ప్రతి విద్యార్థి బాగా చదివి వృద్ధిలోకి వచ్చి ఇటువంటి ఉన్నతమైన పదవులు నిజ జీవితంలో అందుకొని ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా తన భావాన్ని వ్యక్త పరిచాడు ప్రధాన మంత్రి మోడీ.